Hyderabad: హైదరాబాద్ ఐకియాలో పొరబాటున మోగిన ఫైర్ అలారం.. పరుగులు తీసిన ప్రజలు
- అగ్నిప్రమాదం జరిగిందంటూ కలకలం
- ఆ సమయంలో ఐకియాలో 3000 మంది
- పొరబాటున మోగినట్టు గుర్తింపు
హైదరాబాద్ లో కొన్నాళ్ల క్రితమే ఏర్పాటు చేసిన సుప్రసిద్ధ హోమ్ అప్లయాన్సెస్ (గృహోపకరణాలు) సంస్థ ఐకియాలో అగ్నిప్రమాదం జరిగిందంటూ రేగిన కలకలం తీవ్ర భయాందోళనలకు దారితీసింది. షాపింగ్ కు వచ్చినవాళ్లు, ఇతర సిబ్బందితో కలిపి ఐకియాలో 3000 మంది ఉన్న సమయంలో ఒక్కసారిగా ఫైర్ అలారం మోగింది. ఐకియా స్టోర్ లో ఎక్కడ మంటలు రేగినా ఈ అలారం మోగుతుంది. దాంతో అతిపెద్దదైన ఈ స్టోర్లో ఎక్కడో అగ్నిప్రమాదం జరిగిందని భావించి అందరూ పరుగులు తీశారు. బయటికి వెళ్లేందుకు పోటీలుపడ్డారు. అయితే, ఫైర్ అలారం పొరబాటున మోగినట్టు ఐకియా సిబ్బంది గుర్తించడంతో కస్టమర్లు మళ్లీ స్టోర్ లో అడుగుపెట్టారు.