India: అభినందన్ కు 'అహింసా పురస్కార్' అవార్డు

  • జైన మహాసమితి ప్రకటన
  • అవార్డును అందుకుంటున్న మొదటి వ్యక్తి అభినందనే
  • రూ.2.51 లక్షల నగదు, జ్ఞాపిక అందజేత

పాకిస్థాన్ చెర నుంచి క్షేమంగా విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్, పైలట్ అభినందన్ వర్ధమాన్ ను గౌరవించేందుకు అఖిల భారతీయ దిగంబర జైన మహాసమితి ముందుకొచ్చింది. శత్రువుల చెరలో ఉన్నా దేశం కోసం అభినందన్ ప్రదర్శించిన తెగువను దేశవ్యాప్తంగా వేనోళ్ల కీర్తిస్తున్నారు. ఈ క్రమంలో జైన మహాసమితి అభినందన్ ను 'భగవాన్ మహావీర్ అహింసా పురస్కార్' అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది.

 జైన మహాసమితి చైర్ పర్సన్ మహీంద్ర జైన్ ఈ విషయమై ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలను జైన మహాసమితి మహారాష్ట్ర కన్వీనర్ పరాస్ లొహాడే మీడియాకు తెలిపారు. ఈ అవార్డు కింద వింగ్ కమాండర్ అభినందన్ కు రూ.2.51 లక్షల నగదుతో పాటు జ్ఞాపికను కూడా అందజేస్తారు. ఈ అవార్డును అందుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి అభినందన్ కావడం విశేషం. అహింసా పురస్కార్ అవార్డును ఈ ఏడాది నుంచే ఇవ్వాలని నిర్ణయించామని సంస్థ తెలిపింది. ఏప్రిల్ 17న వర్ధమాన మహావీర జయంతిని పురస్కరించుకుని అభినందన్ కు అవార్డును ప్రదానం చేయనున్నారు.

  • Loading...

More Telugu News