isha koppikar: ఇషా కొప్పికర్ పై మండిపడుతున్న రజనీకాంత్, అజిత్ అభిమానులు

  • ఇండస్ట్రీలో అజిత్ ఉన్నారో? లేదో? తెలియదన్న ఇషా
  • యంగ్ రజనీలా శివకార్తికేయన్ ఉన్నాడంటూ వ్యాఖ్య
  • తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న ఇషా

తెలుగులో 'చంద్రలేఖ', 'ప్రేమతో రా', 'కేశవ' చిత్రాల్లో నటించిన బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్... తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు... ఇషాను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.

మీడియాతో తన అభిమాన నటుల గురించి ఇషా చెబుతూ... తనకు అరవిందస్వామి అంటే చాలా ఇష్టమని, ఆయనతో కలసి ఒక సినిమాలో నటించానని చెప్పింది. అజిత్ అన్నా తనకు ఇష్టమేనని, అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఉన్నారో? లేదో? తనకు తెలియదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై అజిత్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఓ నటుడి పట్ల అభిమానం ఉన్నప్పుడు... ఆయన సినిమాలు చేస్తున్నారో లేదో, ఏ స్థాయిలో ఉన్నారో కూడా తెలియదా? అని మండిపడుతున్నారు.

మరోవైపు శివకార్తికేయన్ ను రజనీకాంత్ తో ఇషా పోల్చింది. శివకార్తికేయన్ ను చూస్తుంటే రజనీ యువకుడిగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయని అంది. దీంతో, రజనీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ తో ఓ కుర్ర హీరోను పోల్చుతావా? అంటూ మండిపడుతున్నారు.

isha koppikar
kollywood
Rajinikanth
ajith
  • Loading...

More Telugu News