galla jayadev: అంతవరకు వస్తే.. జైలుకు వెళ్లడానికి కూడా రెడీనే: గల్లా జయదేవ్

  • కేసీఆర్, జగన్ లతో కలసి మోదీ కుట్రలకు పాల్పడుతున్నారు
  • గుజరాత్ రాజకీయాన్ని దేశం మొత్తానికి రుద్దాలనుకుంటున్నారు
  • బడ్జెట్ ప్రసంగం అనంతరం నాకు ఈడీ నోటీసులు ఇచ్చింది 

తాను ఎవరికీ భయపడనని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుజరాత్ రాజకీయాన్ని దేశం మొత్తానికి రుద్దాలని ప్రధాని మోదీ యత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ లతో కలసి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వీరి ముగ్గురి దృష్టి ప్రస్తుతం తనపై పడిందని... పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం అనంతరం తనకు ఈడీ నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు.

తాను పక్కాగా ట్యాక్సులు కడుతున్నానని... తన వద్ద వారికి ఏమీ దొరకలేదని చెప్పారు. దీంతో, తన బంధువులను, స్నేహితులను ఐటీ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తాను తప్పు చేసినట్టు తేలితే... జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని అన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో టీడీపీ గెలుపుకోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందని చెప్పారు.

galla jayadev
kcr
jagan
modi
Telugudesam
ysrcp
TRS
bjp
ed
notice
  • Loading...

More Telugu News