jagan: జగన్ పార్టీ, చంద్రబాబు పార్టీ రెండూ అవినీతి పార్టీలే.. బీజేపీవి నీచ రాజకీయాలు: సీపీఐ రామకృష్ణ

  • ఈ రెండు అవినీతి పార్టీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నాయి
  • యుద్ధ వీరుల త్యాగాలను బీజేపీ వాడుకుంటోంది
  • పవన్ సీమ పర్యటన తర్వాత జనసేన, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుంది

ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు రెండూ అవినీతి పార్టీలేనని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు అవినీతి పార్టీలు రానున్న ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నాయని అన్నారు. వైసీపీకి చెందిన నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు తనవైపు తిప్పుకోవడంలో డబ్బే ప్రధాన పాత్రను పోషించిందని తెలిపారు. బీజేపీవి నీచ రాజకీయాలని ఆయన మండిపడ్డారు. యుద్ధ వీరుల త్యాగాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనలో ఉన్నారని... పర్యటన అనంతరం జనసేన, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుందని చెప్పారు.

jagan
Chandrababu
Pawan Kalyan
ramakrishna
Telugudesam
YSRCP
cpi
janasena
  • Loading...

More Telugu News