Jana Sena: రేపటి నుంచి నెల్లూరులో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన

  • రోడ్‌ షోలు, సభలు, సమావేశాల నిర్వహణ
  • ఈ రోజు రాత్రి నెల్లూరు నగరానికి చేరనున్న పవన్‌
  • రెండు రోజుల పాటు కార్యక్రమాలు

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ రెండు రోజుల నెల్లూరు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. సోమవారం, మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆదివారం రాత్రికి నెల్లూరుకు చేరుకుని అక్కడి ధనలక్ష్మీపురంలోని కేజీకే కల్యాణ మండపంలో రాత్రికి బస చేస్తారు.

సోమవారం ఉదయం 8 గంటలకు ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత విద్యార్థులు, మేధావులతో ముఖాముఖి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్‌ షో ప్రారంభిస్తారు. గాంధీ బొమ్మ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వీఆర్‌సీ సెంటర్‌, మద్రాస్‌ బస్టాండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా పత్తేఖాన్‌పేట రైతుబజార్‌కు చేరుకుంటారు.

ఆ  తర్వాత నల్లపరెడ్డి విగ్రహం మీదుగా పొదకూరు రోడ్డు  సెంటర్‌కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి ధనలక్ష్మీపురం కేజీకే కల్యాణ మండపానికి చేరుకుంటారు. సోమవారం రాత్రి కూడా అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం ఏడు గంటలకు బయలుదేరి కోవూరు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు షోలో కావలి మీదుగా సాగిపోతారు. రోడ్డు మార్గంలో ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తారు.

Jana Sena
Pawan Kalyan
Nellore District
two days tour
  • Loading...

More Telugu News