Andhra Pradesh: టీడీపీ తీర్థం పుచ్చుకున్న శిల్పా రాజగోపాల్ రెడ్డి!

  • డిప్యూటీ సీఎం కేఈ సమక్షంలో టీడీపీలో చేరిన నేత
  • ఇప్పటికే టీడీపీలో చేరిన కోట్ల ఫ్యామిలీ
  • కర్నూలులో మరింత బలోపేతం కానున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో రాజకీయ చేరికలు జోరందుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత శిల్పా రాజగోపాల్ రెడ్డి ఈరోజు టీడీపీలో చేరారు. శిల్పా రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి సోదరుడు కావడం గమనార్హం.

కర్నూలు జిల్లాలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి చేరికతో జిల్లాలో టీడీపీ మరింత బలపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Andhra Pradesh
Kurnool District
YSRCP
Telugudesam
silpa rajagopal reddy
  • Loading...

More Telugu News