ali: గుంటూరుపై హాస్య నటుడు అలీ గురి.. ఓటు హక్కు కోసం దరఖాస్తు!

  • తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచన
  • ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు అందజేత
  • హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉందని తెలిపిన అధికారి

ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ గుంటూరుపై గురిపెట్టారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్టున్నారు. అక్కడ తనకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనలో ఉన్న ఆయన ప్రధాన రాజకీయ పక్షాల అధినేతలను ఇటీవల కలిశారు. తన సినీ ప్రస్థాన సభకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆహ్వానించారు.

దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం ఖాయమని భావిస్తున్న సమయంలో గుంటూరులో ఓటుకు దరఖాస్తు చేయడంతో దాదాపు ఖయమైనట్టే అని భావిస్తున్నారు. తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన అధికారులు ఇప్పటికే ఆయనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు వున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తన ఓటు హక్కు తొలగించి గుంటూరులో ఇవ్వాలని ఆయన కోరారు.

ali
guntur
east consituency
vote
  • Loading...

More Telugu News