Roja: చంద్రబాబు పీడ పోతే... మరుక్షణం ప్రత్యేక హోదా: రోజా

  • చంద్రబాబునాయుడు ఓ చీడపురుగు
  • ఆయన ఏపీని వదిలితే వెంటనే హోదా
  • పుత్తూరులో వైసీపీ మహిళా నేత రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకున్న చంద్రబాబునాయుడు అనే చీడపురుగు పోతే వెంటనే ప్రత్యేక హోదా వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షల ఫలితంగానే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చిందని, చంద్రబాబు వెళ్లిపోతే హోదా కూడా వచ్చేస్తుందని ఆమె అన్నారు. పుత్తూరులో జరిగిన 'జగన్ రావాలి - జగన్ కావాలి' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. జగన్ అమరావతిలో అడుగుపెట్టి గృహ ప్రవేశం చేసిన రోజునే రైల్వే జోన్ ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

నిరాహార దీక్షలు, ధర్నాలతో వైసీపీ ఒత్తిడి తేవడంతోనే జోన్ కల సాకారమైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, కొన్ని రోజుల్లోనే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని ఆమె అన్నారు. "రాజన్న బిడ్డ జగన్ మోహన్ రెడ్డి, అమరావతిలో అడుగుపెట్టగానే, మరి వైజాగ్ కు రైల్వే జోన్ వచ్చింది. ఏపీని చంద్రబాబు వదిలిపోతే, ప్రత్యేక హోదా కూడా వస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు" అని ఆమె అన్నారు.

Roja
YSRCP
Chandrababu
Puttur
Special Category Status
  • Loading...

More Telugu News