India: వింగ్ కమాండర్ అభినందన్ రాకతో అందాల రాణుల సంబరం

  • మా హీరో వచ్చేశాడు
  • శాంతి కోసం ఏకమవుదాం
  • సెల్యూట్ చేస్తున్న సెలబ్రిటీ భామలు

యావత్ భారతదేశం గర్వించేలా సాహసోపేతంగా పోరాడి ఆపై శత్రుసైన్యానికి చిక్కినా ఎట్టకేలకు భారత్ గడ్డపై కాలుమోపాడు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. పాక్ చెర నుంచి అభినందన్ విడుదల కోసం దేశం మొత్తం ప్రార్థించిందంటే అతిశయోక్తి కాదు. తన విమానం సామర్థ్యం పరిమితం అని తెలిసి కూడా ఎంతో ఆధునికమైన పాక్ విమానాన్ని నేలకూల్చిన వైనం అభినందన్ కు హీరో ఇమేజ్ తీసుకువస్తే... శత్రువుల చెరలో ఉండి కూడా ఒక్క రహస్యాన్ని కూడా వెల్లడించని ధీరోదాత్త నైజం అతడి దేశభక్తిని ఘనంగా చాటింది. శుక్రవారం పాక్ కస్టడీ నుంచి విడుదలయ్యాక వాఘా బోర్డర్ పాయింట్ నుంచి భారత గడ్డపై కాలుమోపాడు అభినందన్. అతడి రాకను పురస్కరించుకుని భారత అందాలరాణులు సామాజిక మాధ్యమాల్లో తమ హర్షం వ్యక్తం చేశారు.

యమహా ఫాసినో మిస్ దివా యూనివర్స్ 2018 విజేత నేహాల్ చుదాస్సమా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. మన హీరో తిరిగొచ్చేశాడు అంటూ ఓ పిక్ ను పోస్టు చేసింది. సెల్యూట్ టు వింగ్ కమాండర్ అభినందర్ వర్ధమాన్ అంటూ తన స్పందన తెలియజేసింది. మరో అందాలభామ, బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా స్పందిస్తూ... "వింగ్ కమాండర్ అభినందన్ కు స్వాగతం... స్వదేశాన్ని మించిన స్వర్గంలేదు... మీకు ప్రేమాభివందనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అంటూ పోస్ట్ చేసింది. దియా మీర్జా 2000 సంవత్సరంలో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ విజేత.

ఇక బాలీవుడ్ యువ నటి ఊర్వశీ రౌతేలా భావయుక్తమైన పోస్ట్ తో అభినందన్ కు స్వాగతం పలికింది. "మీ స్ఫూర్తికి, శౌర్యానికి, తెగువకు సెల్యూట్ చేస్తున్నాం. గాయపడినా మీ ముఖంలో కనిపించిన నిబ్బరానికి అభినందనలు" అంటూ పోస్ట్ చేసింది. వీళ్లే కాదు ఈషా గుప్తా, నవేలీ దేశ్ ముఖ్, పార్వతీ ఓమన్ కుట్టన్ వంటి బ్యూటీ క్వీన్స్ సైతం అభినందన్ రాక పట్ల సంతోషం వెలిబుచ్చుతూ సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేశారు.


  • Loading...

More Telugu News