India: అభినందన్ కు ఆదివారం వరకు వైద్యపరీక్షలు... వింగ్ కమాండర్ కు 'శీతలోపచారాలు'

  • కుటుంబ సభ్యులను కలుసుకున్న వింగ్ కమాండర్
  • 'కూలింగ్ డౌన్' ప్రక్రియ నడుస్తోందన్న అధికారులు
  • అనంతరం నిఘా అధికారులతో భేటీ

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ కస్టడీ నుంచి స్వదేశానికి వచ్చిన నేపథ్యంలో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. అభినందన్ శుక్రవారం రాత్రి వాఘా చెక్ పోస్ట్ నుంచి భారత్ లో కాలుమోపాడు. తమ సాహస పైలట్ కు వాయుసేన ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అతడిని ప్రత్యేక వాహనంలో అమృత్ సర్ తరలించి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ఢిల్లీ చేరుకున్న అభినందన్ ను నేరుగా ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏఎఫ్ సీఎంఈ) కు తరలించారు.

అక్కడ వింగ్ కమాండర్ అభినందన్ కు 'కూలింగ్ డౌన్' (శీతలోపచారాలు) ప్రక్రియలో భాగంగా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆదివారం కూడా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వాయుసేన అధికారులు తెలిపారు. ఒక్కసారి ఆరోగ్య పరీక్షల ప్రక్రియ పూర్తయితే, నిఘా అధికారులు అతడితో మాట్లాడే ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. విమానంతో దాడికి బయల్దేరినప్పటి నుంచి తిరిగి వాఘా బోర్డర్ ద్వారా భారత్ కు చేరుకునే వరకు అసలేం జరిగింది అనే విషయాలను అభినందన్ ను అడిగి తెలుసుకుంటారని వాయుసేన ఉన్నతాధికారులు తెలిపారు. ఇక శనివారం ఉదయాన్నే తన కుటుంబ సభ్యులను కలుసుకున్న అభినందన్ వారి యోగక్షేమాలను తెలుసుకున్నాడు.

  • Loading...

More Telugu News