Andhra Pradesh: స్టిక్కర్ బాబూ.. అమరావతికి పట్టిన అవినీతి చెదపురుగువి నువ్వు!: కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శ

  • నిన్న కూలిన ఏపీ హైకోర్టు శ్లాబు
  • చంద్రబాబు లక్ష్యంగా కన్నా విమర్శలు
  • ఏపీ సీఎం బుద్ధులతో పాటు నిర్మాణాలూ నాసిరకంగా ఉన్నాయని ఎద్దేవా

అమరావతిలో నిర్మిస్తున్న ఏపీ హైకోర్టు శ్లాబు నిన్న కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. దీంతో వీరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అమరావతికి పట్టిన అవినీతి చెద పురుగు అని విమర్శించారు. ఆయన బుద్ధులతో పాటు నిర్మాణాలు కూడా నాసిరకంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘స్టిక్కర్ బాబూ.. అమరావతికి పట్టిన "అవినీతి చెద పురుగు"వి నువ్వు.. నీ బుద్ధులే కాదు నీ నిర్మాణాలు కూడా "నాసిరకమే". సెక్రటేరియట్లో వర్షం.. పోలవరంలో పగుళ్లు.. హైకోర్టు శ్లాబ్ కూలడం. "గోడ కట్టడం రాదు గాని గోల్కొండ కోట కట్టా "అని కహానీ చెప్పే నీలాంటివాడిని పిచ్చోడు అనక ఏమనాలి?’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
amaravti
High Court]
slab
collapse
kanna
bjp
criticise
Twitter
  • Loading...

More Telugu News