keerthi suresh: హిందీ సినిమాను ఒప్పేసుకున్న కీర్తి సురేశ్?

  • అందాల కథానాయికగా పేరు 
  • తమిళంలోనూ మంచి క్రేజ్
  •  బోనీకపూర్ బ్యానర్ నుంచి ఆఫర్ 

తెలుగులో ఇప్పుడు కీర్తి సురేశ్ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. తమిళంలోను ఆమె అదే హోదాలో తన జోరు చూపుతోంది. ఈ మధ్యకాలంలో తమిళంలో వరుసబెట్టి విజయాలను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఒక హిందీ సినిమాను అంగీకరించినట్టుగా కోలీవుడ్ టాక్.

ఇంతకుముందు హిందీలో 'బధాయి హో'తో హిట్ కొట్టేసిన అమిత్ శర్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడట. ఈ సినిమాను బోనీకపూర్ నిర్మించనున్నట్టు సమాచారం. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో, చాలా మంది కథానాయిల పేర్లను పరిశీలించారట. చివరికి కీర్తి సురేశ్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించడం .. ఆమె ఓకే చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాలో తన రోల్ ఛాలెంజింగ్ గా ఉండటంతోనే కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News