Pulwama attack: అభినందన్ విడుదలను స్వాగతించిన ఫ్రాన్స్.. పుల్వామా దాడి బాధ్యులకు శిక్ష పడాల్సిందేనని ఉద్ఘాటన

  • రెండు దేశాలు సంయమనం పాటించాయి
  • ద్వైపాక్షిక చర్చల దిశగా ప్రోత్సహిస్తాం
  • రెండు దేశాలు తమ బాధ్యతను గుర్తించాయి

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ సురక్షితంగా భారత్‌కు అప్పగించడాన్ని ఫ్రాన్స్ స్వాగతించింది. ఇరు దేశాలు తమ బాధ్యతను గుర్తించి సంయమనం పాటించాయని ప్రశంసించింది. ఈ మేరకు ఆ దేశ యూరప్-విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-వైవెస్ లి డ్రియాన్ పేర్కొన్నారు. అభినందన్‌ విడుదలను స్వాగతిస్తున్నట్టు చెప్పిన జీన్.. ఇక మిగిలింది ఇరు దేశాల మధ్య చర్చలేనని, ఆ దిశగా ఇరు దేశాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

‘‘ఇరు దేశాలు తమ బాధ్యతను గుర్తించి సంయమనం పాటించడాన్ని ఆహ్వానిస్తున్నాం. ద్వైపాక్షిక చర్చల దిశగా రెండు దేశాల ప్రభుత్వాలను చర్చల దిశగా ప్రోత్సహిస్తాం’’ అని జీన్ పేర్కొన్నారు. అంతేకాదు, పుల్వామా దాడికి కారకులైన వారికి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనని పేర్కొన్న మంత్రి అందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Pulwama attack
India
Pakistan
France
Abhinandan Varthaman
  • Loading...

More Telugu News