India: ముందు వైద్యపరీక్షలు.. ఆ తర్వాతే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం!

  • అభినందన్ కు ముందు వైద్య పరీక్షల నిర్వహణ
  • ఆ తర్వాతే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం
  • ఇంటెలిజెన్స్ యూనిట్ కు తరలించేందుకు ఏర్పాట్లు

పాకిస్థాన్ చెర నుంచి శుక్రవారం విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కొద్దిసేపటి క్రితమే భారత్ లో కాలు మోపాడు. దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. వాఘా బోర్డర్ వద్ద ఈ ఉదయం నుంచి తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, పాక్ అధికారులు సుదీర్ఘమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ముగించి అభినందన్ ను భారత్ కు అప్పగించారు.

అయితే, భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్ కు మొదట వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని భారత వాయుసేన భావిస్తున్నట్టు సమాచారం. పాక్ ఇంటెలిజెన్స్ విభాగాలు అభినందన్ శరీరంలో ఏవైనా ఎలక్ట్రానిక్ చిప్స్ కానీ, బగ్స్ కానీ అమర్చే అవకాశాలు ఉండడంతో అందుకు అవసరమైన పరీక్షలన్నీ నిర్వహించాలని వాయుసేన నిర్ణయించింది. కొన్ని సైకలాజికల్ పరీక్షలు కూడా నిర్వహించి, అభినందన్ మానసిక స్థితిని అంచనా వేయనున్నారు. మొత్తమ్మీద నాలుగు దశల్లో పరీక్షలు జరిపి ఆ తర్వాతే అభినందన్ కు తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News