Jagan: రౌడీయిజం, అవినీతి చేసేవాళ్లు వైసీపీలోకి వెళుతున్నారు: చంద్రబాబు ధ్వజం

  • స్వప్రయోజనాలే కానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
  • రాష్ట్ర పరువును జగన్ రోడ్డుకీడుస్తున్నారు
  • ఆధారాలుండబట్టే ఆస్తులను ఈడీ జప్తు చేసింది

తమ పార్టీలోకి ప్రజాసేవే ధ్యేయంగా ఉన్నవారు వస్తుంటే.. వైసీపీలోకి మాత్రం రౌడీయిజం, అవినీతి చేసేవాళ్లు వెళుతున్నారని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్‌కు స్వప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

ప్రజల సొమ్ము దోచుకుని రాష్ట్ర పరువును జగన్ రోడ్డుకీడుస్తున్నారని.. ఆధారాలుండబట్టే ఈడీ జగన్‌కు చెందిన వేల కోట్ల ఆస్తులను జప్తు చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. కన్సల్టెంట్లతో పార్టీని నడపడం జగన్ నైజమని.. కేసీఆర్, మోదీ, జగన్ ముగ్గురూ కలసి నీచ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ పర్యటనకు భయపడి మోదీ మొక్కుబడిగా రైల్వే జోన్ ఇచ్చారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Jagan
Chandrababu
Narendra Modi
KCR
ED
Railway Zone
  • Loading...

More Telugu News