India: అభినందన్ కు పూర్తయిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ... కొద్దిసేపట్లో భారత్ లో అడుగుపెట్టే అవకాశం!
- భారత పైలట్ కు సింగిల్ పేజీ వీసా మంజూరు
- ముగ్గురు భారత అధికారుల సమక్షంలో పత్రాలు పరిశీలన
- ఎయిర్ వైస్ మార్షల్ స్వాగత ప్రకటన
పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ లాహోర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నాడు. బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పాక్ అధికారులు అభినందన్ కు ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ నిర్వహించి పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయనకు సింగిల్ పేజీ వీసా మంజూరు చేశారు. ముగ్గురు భారత అధికారుల సమక్షంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది. ఇక భారత్ లో అడుగుపెట్టేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అభినందన్ ఏ క్షణంలోనైనా భారత గడ్డపై కాలుమోపే అవకాశాలున్నాయి. ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ పైలట్ అభినందన్ ను స్వాగతిస్తూ ప్రకటన చేసే అవకాశాలున్నాయి.