Pulwama Attack: ఒక్కసారైనా ఉగ్రదాడిని ఖండించని ఇమ్రాన్‌ను ఇంకేం నమ్ముతాం?: అమిత్ షా

  • మా ట్రాక్ రికార్డ్ చాలా గొప్పది
  • పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టాం
  • మాట వరసకైనా ఇమ్రాన్ ఖండించాల్సింది

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ చాలా గొప్పదని.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. నేడు ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మద్దతు పలికేవారిలో భయం పుట్టించడంలో ప్రధాని నరేంద్రమోదీ సఫలమయ్యారని తెలిపారు.

పుల్వామా ఉగ్రదాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మౌనం వహించడంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘కనీసం ఒక్కసారి కూడా పుల్వామా ఉగ్రదాడిని ఖండించని ఇమ్రాన్‌ను ఇంకేం నమ్ముతాం? కనీసం మాట వరుసకైనా ఖండించి ఉండాల్సింది కానీ, అలాంటి పరిస్థితులు ఆయన చేతిలో లేకపోయి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. కమాండర్ అభినందన్‌ను వెనక్కి రప్పించే పరిస్థితులను కలగజేశామని.. అది తమ దౌత్య విజయమని అమిత్ షా పేర్కొన్నారు.

Pulwama Attack
Terrorists
Amith Shah
Imran Khan
Narendra Modi
  • Loading...

More Telugu News