manirathnam: మణిరత్నం నుంచి చారిత్రక చిత్రం .. మోహన్ బాబుతో సంప్రదింపులు?
- తమిళ నవలగా 'పొన్నియన్ సెల్వన్'
- మొదటి రాజరాజ చోళుని కథ
- మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్
మణిరత్నం సినిమా అంటే ఆ కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఒక్కోసారి అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది .. ఒక్కోసారి కాదు .. అంతే. ఈ మధ్యన ఆయన నుంచి మల్టీ స్టారర్ గా వచ్చిన 'నవాబ్' తమిళంలో విజయాన్ని సాధించింది .. తెలుగులోనూ మంచి మార్కులే తెచ్చుకుంది. తాజాగా ఆయన ఓ భారీ చారిత్రక చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరపైకి తీసుకురానున్నారు. క్రీ.శ 947లోని మొదటి రాజరాజ చోళుని కథగా ఈ సినిమా రూపొందనుంది. మణిరత్నం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకి మోహన్ బాబును అనుకుని, ఆయనను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్టుగా మణిరత్నం చెప్పుకునే ఈ సినిమాలో, మోహన్ బాబు ఏ పాత్రను ధరించనున్నారో చూడాలి.