Andhra Pradesh: వైసీపీ నేత రోజావి పగటి కలలే: టీడీపీ ఎమ్మెల్యే అనిత

  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం
  • రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
  • జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందేమో

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత విమర్శలు గుప్పించారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈరోజు ఆమె దర్శించుకున్నారు. అనంతరం, విలేకరులతో ఆమె మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ మళ్లీ ప్రతిపక్ష నేతగానే మిగిలిపోతారని, తమ పార్టీ విజయం సాధిస్తుందనుకుంటున్న రోజావి పగటి కలలేనని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పైనా ఆమె వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

Andhra Pradesh
Telugudesam
mla
anitha
YSRCP
  • Loading...

More Telugu News