pakistan: పాక్ భాగోతం బట్టబయలు.. ఉగ్రవాదులపై దాడి కోసం అమెరికా నుంచి తీసుకున్న మిస్సైల్ భారత్ పై ప్రయోగం!

  • ఉగ్రవాదంపై పోరాడతామంటూ పాక్ సన్నాయి నొక్కులు
  • అమెరికా నుంచి నిధులు, ఆయుధాల స్వీకరణ
  • ఉగ్రవాదులపై వాడాల్సిన మిసైల్ భారత్ పై ప్రయోగం

ఉగ్రవాదంపై పోరాడుతామంటూ అమెరికా నుంచి భారీ ఎత్తున నిధులను, ఆయుధాలను పొందిన పాకిస్థాన్... వాటిని ఎందుకు వాడుతోందో బట్టబయలైంది. భారత మిలిటరీ స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు యత్నించిన సంగతి తెలిసిందే. వాటిన మన జెట్ ఫైటర్లు వెంబడించేసరికి వెనక్కి మళ్లాయి. పోతూపోతూ బాంబులను జార విడిచాయి. మిసైల్స్ తో దాడి చేశాయి.

ఈ నేపథ్యంలో ఎఫ్-16 విమానం నుంచి పాక్ ప్రయోగించిన ఒక మిసైల్ శకలాన్ని మన సైన్యం గుర్తించింది. రాజౌరీ సెక్టార్ లో అమ్రామ్ (అడ్వాన్స్ డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్)కు చెందిన మెటల్ శకలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మిసైల్స్ ను అమెరికా నుంచి పాకిస్థాన్ పొందింది. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికే ఈ మిసైల్స్ ను ఉపయోగిస్తామనే కండిషన్ పై యూఎస్ నుంచి తీసుకుంది. కానీ, నిబంధనలు తుంగలో తొక్కి ఆ మిసైల్స్ ను భారత్ పై ప్రయోగించింది. దీంతో, పాక్ వక్ర బుద్ధి మరోసారి బట్టబయలైంది.

  • Loading...

More Telugu News