Hanmakonda: మృత్యువుతో పోరాడుతున్న రవళి... పరిస్థితి విషమమంటున్న వైద్యులు!

  • హన్మకొండలో ప్రేమోన్మాది దాడి
  • రవళికి 70 శాతం కాలిన గాయాలు
  • ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స

హన్మకొండలో ప్రేమోన్మాది దాడికి గురై, తీవ్ర గాయాల పాలైన డిగ్రీ విద్యార్థిని తోపుచర్ల రవళి ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అనంతరం, ఆమెను హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోదా ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. రవళిపై సాయి అన్వేష్ అనే యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమెకు 70 శాతం గాయాలు అయ్యాయి. సాయి అన్వేష్ ను రిమాండ్ కు తరలించిన పోలీసులు, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు.

Hanmakonda
Ravali
Burns
Anvesh
Yasoda
Doctors
Criticle
  • Loading...

More Telugu News