Andhra Pradesh: ఆత్మకూరు, కావలి, వెంకటగిరిలో పోటీ చేసేది వీరే.. ప్రకటించిన చంద్రబాబు!

  • నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్య
  • వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణకు మరో ఛాన్స్
  • కావలి సీటును బీద మస్తాన్ రావుకు ఓకే చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోరు పెంచారు. నెల్లూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్యకు టికెట్ కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మేకపాటి కుటుంబీకులు కూడా వైసీపీలోనే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న కృష్ణయ్యను చంద్రబాబు రంగంలోకి దించారు.

అలాగే కావలి నియోజకవర్గం నుంచి బీద మస్తాన్ రావు, వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల రామకృష్ణకు టికెట్ ఖరారు చేసినట్లు ఏపీ సీఎం వెల్లడించారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి పోతుల రామారావు పేరును సీఎం ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు ఈరోజు తిరుపతి, సత్యవేడు, సూళ్లూరు పేట, గూడూరు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులను ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేయనున్నారు. 

Andhra Pradesh
Telugudesam
seats
Nellore District
atmakur
kavali
venkatagiri
Chandrababu
  • Loading...

More Telugu News