Kadapa District: ప్రొద్దుటూరులో దారుణం.. పదో తరగతి బాలికపై విద్యార్థుల అత్యాచారం

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • విషయాన్ని బయటపెడితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని హెచ్చరించిన పాఠశాల యాజమాన్యం
  • మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాల హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి బాలికపై అదే పాఠశాలలో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థి.. పూర్వ విద్యార్థితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల 24నే ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనపై అత్యాచారం జరిగిందంటూ బాధిత బాలిక పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయం గురించి బయట ఎక్కడైనా చెబితే పది పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచని విద్యార్థిని పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అప్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

బాలిక కాలు జారి కిందపడిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన స్కూలు యాజమాన్యం  ఆమెకు కర్నూలు జిల్లాలో వైద్యం చేయించేందుకు ప్రయత్నించింది. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు బాలికను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.  

Kadapa District
Prodduturu
Gang rape
Andhra Pradesh
Kurnool District
Private school
  • Loading...

More Telugu News