India: అభినందన్ వీడియోలు డిలీట్ చేయండి.. యూట్యూబ్ కు కేంద్రం ఆదేశం

  • పాలసీ ప్రకారం నడుచుకుంటాం
  • కేంద్రం ఆదేశాలకు స్పందించిన గూగుల్
  • వీడియోలు తొలగించేందుకు సమ్మతం

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత వాయుసేన పైలెట్ అభినందన్ వర్ధమాన్ కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలంటూ కేంద్రం ఆదేశించింది. పాక్ సైన్యం అదుపులో ఉన్న అభినందన్ ను తీవ్రంగా హింసించిన ఆనవాళ్లు ఉండడంతో సదరు వీడియోలు ప్రజల మనోభావాలను గాయపరిచేవిగా ఉన్నట్టు కేంద్రం భావిస్తోంది. ఆ వీడియోలు తొలగించాల్సిందేనంటూ ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ను ఆదేశించింది. హోం శాఖ సూచనల మేరకే తాము ఆదేశాలు జారీచేశామని సమాచార, ప్రసార శాఖ తెలిపింది. దీనిపై యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ... అధికార వర్గాల నుంచి న్యాయసమ్మతమైన అభ్యర్థనలు అందాయని, అలాంటి వీడియోలు తొలగించడంలో తాము సుదీర్ఘకాలంగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయిన కొద్దిసేపటికే యూట్యూబ్ నుంచి సదరు లింకులు మాయమైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News