ashok kumar: టీడీపీ కండువా కప్పుకున్న అశోక్ బాబు

  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అశోక్ బాబు
  • ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
  • రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వ్యాఖ్య

ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ, తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీపై ప్రజల్లో విశ్వాసం ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

ashok kumar
apngo
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News