Chandrababu: ఇది మోదీ, జగన్ ఆడుతున్న మరో కుట్ర: చంద్రబాబు నిప్పులు

  • ఎన్నికల నోటిఫికేషన్ ముందు రైల్వే జోన్
  • తక్కువ ఆదాయం వచ్చేలా చూస్తున్నారు
  • రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన
  • టెలీ కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, మరోసారి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నారని, అందులో భాగంగానే, ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు హడావుడిగా రైల్వే జోన్ ను ప్రకటించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.

ఈ ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్, మసిబూసిన మారేడుకాయ వంటిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి తక్కువ ఆదాయం వచ్చేందుకు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. విభజన హామీల అమలుపై శుక్రవారం నాడు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, ఈ కార్యక్రమంలో ప్రతి టీడీపీ కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైల్వే జోన్ ఇచ్చారని వైసీపీ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేసిన ఆయన, కేంద్రం చేసిన మోసాన్ని ఆ పార్టీ కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు.

Chandrababu
Railway Zone
Jagan
YSRCP
Narendra Modi
  • Loading...

More Telugu News