Warangal Urban District: ఆన్ లైన్ లో లీక్ అయిన రవళి, సాయి అన్వేష్ ప్రైవేట్ చిత్రాలు!

  • బుధవారం వరంగల్ లో దారుణ ఘటన
  • రవళిపై పెట్రోలుపోసి నిప్పంటించిన అన్వేష్
  • ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న చిత్రాలు

నిన్న వరంగల్ లో పట్టపగలు డిగ్రీ చదువుతున్న విద్యార్థిని రవళిపై అత్యంత అమానుషంగా పెట్రోలు పోసి నిప్పంటించిన సాయి అన్వేష్ ను కఠినంగా శిక్షించాలని మహిళాసంఘాలు, ఎన్ కౌంటర్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న వేళ, గతంలో రవళి, అన్వేష్ లు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్వేష్ ను గతంలో రవళి ప్రేమించిందని, ఆపై ఎక్కడో చెడగా, అతన్ని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఆ కోపంతోనే అన్వేష్ పెట్రోలు తెచ్చి ఆమెను అంటించాడు. ప్రస్తుతం రవళిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. 

Warangal Urban District
Petrol Attack
Ravali
Anvesh
Private Pictures
  • Loading...

More Telugu News