Vietnam: కలిసిన భిన్నధ్రువాలు... ఏడాది వ్యవధిలో ట్రంప్, కిమ్ రెండో భేటీ!

  • వియత్నాంలో ఇరు దేశాధినేతల భేటీ
  • ఏడాది వ్యవధిలో రెండోసారి సమావేశం
  • తమ భేటీని ప్రపంచం స్వాగతించిందన్న కిమ్

రెండు భిన్న ధ్రువాలు మరోసారి కలిశాయి. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలన్న అమెరికా ప్రయత్నాలు కార్యరూపం దాల్చే దిశగా మరో అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వియత్నాంలోని హనోయ్ లో భేటీ అయ్యారు. ఏడాది వ్యవధిలో వారిద్దరి మధ్యా ఇది రెండో భేటీ. ఇక్కడి సోఫీటెల్‌ లెజెండ్‌ మెట్రోపోల్‌ హోటల్‌ లో నేతలిద్దరూ సమావేశమయ్యారు.

ఆపై కిమ్‌ మాట్లాడుతూ, ఈ సమావేశం గొప్ప ఫలితాన్ని ఇస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. తమ భేటీని ప్రపంచం స్వాగతిస్తోందని అన్నారు. ఆపై ట్రంప్ మాట్లాడుతూ, గతంలో జరిగి న చర్చల కంటే, ఈ సమావేశం మెరుగ్గా సాగిందని తెలిపారు. కాగా, గత సంవత్సరం జూన్ 12న సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్‌ లో వీరిద్దరూ సమావేశమైన సంగతి తెలిసిందే. ఆపై ఖండాంతర క్షిపణి ప్రయోగాలను, అణు పరీక్షలనకు కిమ్ సర్కారు నిలిపివేసింది.

  • Loading...

More Telugu News