Andhra Pradesh: కోడెల ఓ ఫ్యాక్షనిస్టు.. ఇప్పుడు నీతులు చెబుతున్నారు!: అంబటి రాంబాబు ఫైర్

  • గతంలో ఎవరి ఇంట్లో బాంబులు పేలాయో తెలిసిందే
  • అవినీతికి పాల్పడలేదని కోడెల ప్రమాణం చేస్తారా?
  • కోడెల వల్ల ఆయన పిల్లలకు రాజకీయ జీవితం లేకుండా పోయింది

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల ఓ ఫ్యాక్షనిస్టు అని, ఇప్పుడు తమకు నీతులు చెప్పడం తగదని విమర్శించారు. గతంలో ఎవరి ఇంట్లో బాంబులు పేలాయో అందరికీ తెలుసంటూ నాడు కోడెల నివాసంలో పేలిన బాంబుల గురించి పరోక్ష విమర్శలు చేశారు. అలాంటి కోడెల ఇప్పుడు తమకు నీతులు చెప్పడమా? అని ఎద్దేవా చేశారు. కోడెల వల్ల ఆయన పిల్లలకు రాజకీయ జీవితం లేకుండా పోతోందని వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని త్రికోటేశ్వర స్వామి సాక్షిగా కోడెల ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు.

Andhra Pradesh
assembly
speaker
shiva prasad
  • Loading...

More Telugu News