Tollywood: మంచి భర్తలు ఎవరూ లేరు: జయప్రద ఆవేదన

  • సమాజంపై సంచలన వ్యాఖ్యలు
  • భర్తలు ఎలా ఉన్నా భార్యలు భరించాల్సిందే
  • వేల సంవత్సరాలుగా ఇదే తంతు

తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ నటీమణుల్లో జయప్రద ఒకరు. అందం, అభినయం కలబోతగా ఆమె ఓ వెలుగు వెలిగింది. అటు రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసే ప్రయత్నంలో విఫలమైంది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో బిజీగా ఉంది జయప్రద. ఉత్తరాది ప్రజలు ఎక్కువగా వీక్షించే పర్ఫెక్ట్ పతి అనే సీరియల్ లో నటిస్తోంది. అందులో ఆమె పాత్ర పేరు రాజ్యశ్రీ రాథోడ్. ఈ సీరియల్ లో కోడలి కోసం కన్నకొడుకునే చంపేస్తుంది రాజ్యశ్రీ రాథోడ్. మహిళల హక్కుల కోసం పోరాడే ఆ పాత్రను జయప్రద అద్భుతంగా పోషిస్తోంది. తన తాజా ప్రస్థానం గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ భారతీయ సమాజం గురించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది.

ఎంతో చరిత్ర ఉన్న మన సమాజం మంచి భర్తలను అందించడంలో విఫలమైందని అబిప్రాయం వ్యక్తం చేసింది. అమ్మాయిలను మంచి భార్యలుగా తయారుచేసి పురుషులకు అందించడానికి సమాజం ఎంతో ప్రయాస పడుతోందని, అదే సమయంలో మంచి భర్తలను తయారుచేయలేకపోతోందని విమర్శించింది. భర్తలు ఎలాంటి వాళ్లయినా భరించాల్సిందే అన్నట్టుగా అమ్మాయిలను తయారుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది జయప్రద. నేటి సమాజంలో మంచి భర్తలు ఎవరూ లేరు అంటూ తన అభిప్రాయం వెల్లడించింది.

Tollywood
Jaya Prada
  • Loading...

More Telugu News