Vizag: విశాఖకు రైల్వేజోన్ ప్రకటన నమ్మక ద్రోహం: చలసాని శ్రీనివాస్

  • విశాఖకు అన్యాయం జరిగింది
  • లోతుగా ఆలోచిస్తే విశాఖకు ఒరిగేదేమీ లేదు
  • ఈ ప్రాంతంలో అధిక భాగం రాయగడ డివిజన్ లోనే చేర్చారు  

విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ‘రైల్వేజోన్’ కు పోరాడిన విశాఖకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 90 శాతం ఈ ప్రాంతాన్ని రాయగడ డివిజన్ లోనే ఉంచారని అన్నారు. ఈ విషయమై తొలుత హర్షం వ్యక్తం చేసినప్పటికీ, లోతుగా ఆలోచిస్తే విశాఖకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. కాగా, విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు ప్రకటన వెలువడ్డ అనంతరం హర్షం వ్యక్తం చేసిన చలసాని ఆ తర్వాత పై వ్యాఖ్యలు చేశారు. 

Vizag
railway zone
special status
chalasani
  • Loading...

More Telugu News