Andhra Pradesh: రైల్వేజోన్ ప్రకటనపై సంతోషం.. ‘ప్రత్యేక హోదా’ కూడా వస్తుందని ఆశిస్తున్నాం: అవంతి శ్రీనివాస్

  • ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు
  • ఇది విశాఖ ప్రజల విజయం
  • ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది

విభజన చట్టంలో ఇచ్చిన హామీలో భాగంగా ఏపీకి రైల్వేజోన్ ను ప్రకటించడంపై వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు అని, ఇది విశాఖ ప్రజల విజయమని, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుతో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

Andhra Pradesh
Vizag
railway zone
YSRCP
avanti srinivas
special status
chalasani
srinivas
  • Loading...

More Telugu News