Narendra Modi: ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న నెటిజన్లు

  • ఖేలో ఇండియా యాప్‌ను ప్రారంభించిన మోదీ
  • ఇప్పుడు కావల్సింది యాప్‌లు కాదంటున్న నెటిజన్లు
  • పైలట్‌ను క్షేమంగా బయటకు తీసుకురావాలి

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలో ఖేలో ఇండియా యాప్‌తో పాటు.. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019ని ప్రారంభించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని.. దేశమంతా విపరీతమైన టెన్షన్‌లో ఉన్న ఈ సమయంలో మోదీ ప్రారంభోత్సవాలు చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తమకు కావల్సింది యాప్‌లు కావని.. పాక్ చెరలో ఉన్న పైలట్ అభినందన్‌ను క్షేమంగా బయటకు తీసుకురావడమని ప్రకటిస్తున్నారు. దేశం ఇంత క్లిష్ట సమయంలో వున్నప్పుడు ఒక ప్రధాని ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Narendra Modi
Khelo India
National Youth Festival
Abhinandan
India
Pakistan
  • Loading...

More Telugu News