India: పాకిస్థాన్ వక్రబుద్ధి.. పారిపోతూ కశ్మీర్ లో బాంబులు వేసిన పాక్ యుద్ధ విమానాలు!

  • నౌషేరా సెక్టార్ లో గగనతల ఉల్లంఘన
  • ఐఏఎఫ్ రంగంలోకి దిగడంతో పరార్
  • ప్రాణ, ఆస్తినష్టంపై ఇంకా రాని స్పష్టత

దాయాది దేశం పాకిస్థాన్ ఈరోజు భారత గగనతల ఉల్లంఘనకు పాల్పడిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ లోని నౌషేరా సెక్టార్ లోకి పాక్ యుద్ధ విమానాలు ఈరోజు దూసుకొచ్చాయి. వెంటనే భారత వాయుసేన(ఐఏఎఫ్) ఫైటర్ జెట్లు వెంబడించడంతో పలాయనం చిత్తగించాయి. అయితే పారిపోయే ముందు పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంపై బాంబు దాడులు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ దాడిలో పౌరులు, ఆర్మీ సిబ్బంది ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం వాటిల్లింది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిన్న చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ లో పాకిస్థాన్ లోని బాలాకోట్ లో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

India
Pakistan
drop bombs
indian air space
IAF
  • Loading...

More Telugu News