Guntur District: జగన్‌ గృహప్రవేశం...కొత్తింట్లో కాలుపెట్టిన వైసీపీ అధినేత

  • సర్వమత ప్రార్థనల అనంతరం ప్రవేశం
  • హాజరైన కుటుంబ సభ్యులు
  • పక్కనే ఏపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఆంధ్ర రాజధాని అమరావతి సమీపంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నూతనంగా నిర్మించిన ఇంట్లోకి ఈరోజు ప్రవేశించారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, బావ అనిల్‌కుమార్‌, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో సర్వమత ప్రార్థనల అనంతరం ఆయన కొత్తింట్లోకి అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్‌ కొత్త ఇంటిని నిర్మించిన విషయం తెలిసిందే. సమీపంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. దీంతో గృహప్రవేశం అనంతరం జగన్‌ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అందువల్ల త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజకీయ కార్యకలాపాలు లోటస్‌ పాండ్‌ నుంచి తాడేపల్లికి మారే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, ఆర్కే రోజా, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

Guntur District
tadepalli
Jagan
new house
  • Loading...

More Telugu News