simbu: శింబు నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను: హీరోయిన్ ఓవియా

  • తమిళంలో బిజీ అయిన 'ఓవియా'
  • శింబు నాకు మంచి స్నేహితుడు
  • ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకుంటాడు          

తమిళ తెరపై యువ కథానాయికగా ఓవియా తన జోరు పెంచుతోంది. వరుస సినిమాలతో తన దూకుడును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె శింబుతో లవ్ లో పడిందనే ప్రచారం ఊపందుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ఆమె ప్రస్తావించింది. "స్నేహానికి .. ప్రేమకి మధ్య చాలా తేడా వుంది. శింబుకి .. నాకు మధ్య వున్నది స్నేహామే గాని ప్రేమకాదు.

శింబు మంచి స్నేహితుడు .. నా వ్యక్తిగత విషయాలను నేను తనతో షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు .. సూచనలు తీసుకుంటాను. ఏ సాయం కోసమైనా .. ఏ సమయంలోనైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు వుంది. ఎదుటివారి కష్ట సుఖాలను అర్థం చేసుకోగల మంచి మనసు శింబుకి వుంది. ఎదుటివారి సమస్యలకి తగిన పరిష్కారాలు సూచించగలగడంలో ఆయన ముందుంటాడు. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలనే నేను కోరుకుంటున్నాను" అంటూ ఓవియా చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News