Warangal Urban District: వరంగల్ శార్వాణి కళాశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి

  • యాసిడ్ పోసి పరారైన యువకుడు
  • బాధితురాలి పరిస్థితి విషమం
  • నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు

వరంగల్ జిల్లా హన్మకొండలో డిగ్రీ విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడి శార్వాణి కళాశాలలో చదువుకుంటున్న యువతిపై, ఈ ఉదయం ఓ యువకుడు యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. యాసిడ్ ముఖం, మెడ, చేతులపై పడింది. వెంటనే స్పందించిన కళాశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, ఆ యువకుడు ఎవరన్న విషయమై ఆరా తీస్తున్నారు. బాధితురాలు మాట్లాడే స్థితిలో లేదని, ఆమె మాట్లాడితే, అతను ఎవరన్నది తెలుస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Warangal Urban District
Hanmakonda
Acid Attack
  • Loading...

More Telugu News