Narendra Modi: దాడి జరిగిన రాత్రంతా మోదీ జాగారం.. కునుకు లేకుండా క్షణక్షణం పర్యవేక్షించిన ప్రధాని

  • సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పర్యవేక్షణ
  • పైలట్లు సురక్షితంగా ల్యాండయ్యాకే దైనందిన కార్యక్రమాలు
  • దాడిలో పాల్గొన్న పైలట్లకు మోదీ అభినందనలు

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడిన రోజున ప్రధాని నరేంద్రమోదీ అస్సలు నిద్రపోలేదట. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం దాడి ముగిసి విమానాలు సురక్షితంగా భారత్‌లో ల్యాండ్ అయ్యే వరకు మోదీ మెలకువగానే ఉండి అనుక్షణం పర్యవేక్షించారట. ఆపరేషన్ విజయవంతం అయిందన్నవార్త తెలిసిన తర్వాతే ప్రధాని కాస్తంత విశ్రాంతి తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

సోమవారం రాత్రి ఓ టీవీ చానల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మోదీ రాత్రి 9:15 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని నివాసానికి చేరుకున్నారు. పది నిమిషాల్లోనే డిన్నర్ పూర్తిచేసి పాక్‌ భూభాగంలో నిర్వహించనున్న మెరుపు దాడుల పర్యవేక్షణలో మునిగిపోయినట్టు సమాచారం. ఆపరేషన్ ముగిసిన వెంటనే పైలట్ల యోగక్షేమాల గురించి ప్రధాని ఆరా తీశారు. అనంతరం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆపరేషన్‌లో పాల్గొన్న పైలట్లకు ప్రధాని అభినందనలు తెలిపారు.  

  • Loading...

More Telugu News