Pawan Kalyan: అహోబిలంలో గవర్నర్‌తో పవన్ కల్యాణ్ భేటీ

  • కర్నూలు పర్యటనలో ఉన్న పవన్
  • ఆళ్లగడ్డ పర్యటన రద్దు
  • గవర్నర్‌తో 15 నిమిషాలు భేటీ

కర్నూలు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఆకస్మికంగా భేటీ అయ్యారు. గత రెండు రోజులుగా కర్నూలులోనే ఉన్న పవన్ మంగళవారం ఆళ్లగడ్డలో పర్యటించాల్సి ఉంది. అయితే, దానిని రద్దు చేసుకుని అహోబిలం వెళ్లారు. అప్పటికే అక్కడి నవ నరసింహస్వామి పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చిన గవర్నర్ నరసింహన్‌తో పవన్ భేటీ అయ్యారు. ఇద్దరూ దాదాపు 15 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.  ఆళ్లగడ్డ పర్యటనను రద్దు చేసుకుని మరీ గవర్నర్‌ను కలవడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan
Narasimhan
Governer
Andhra Pradesh
Kurnool District
Ahobilam
  • Loading...

More Telugu News