Pakistan: సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలపై ప్రతాపం చూపించిన పాకిస్థాన్
- భారత సినిమాలపై నిషేధం
- యాడ్ ఫిలింస్ పైనా బ్యాన్
- సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో పాక్ ఉక్రోషం
పాకిస్థాన్ లో సర్జికల్ స్ట్రయిక్స్-2 ప్రభావం బాగానే పడినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. బాలాకోట్ లో ఉగ్రవాద స్థావరాలను భారత వాయుసేన విమానాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ సర్కారులో ఉక్రోషం పెల్లుబుకుతోంది. భారత్ దాడిని తిప్పికొట్టలేకపోయామన్న అసహనం వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పాక్ లో భారతీయ చిత్రాలను నిషేధించారు. భారత సినిమాలే కాకుండా భారత్ లో రూపొందిన వాణిజ్య ప్రకటనలపైనా ఈ నిషేధం వర్తిస్తుందని పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌధరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. "పాకిస్థాన్ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భారతీయ చిత్రాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకుంది. పాకిస్థాన్ లో ఇకపై ఏ భారతీయ చిత్రం రిలీజ్ కాదు. అలాగే భారత్ లో చిత్రీకరించిన యాడ్ ఫిలింస్ కూడా ప్రసారం చేయరాదని ఆదేశాలిచ్చాం" అని ఫవాద్ చౌధరీ ట్వీట్ చేశారు.