Tollywood: ఫసక్ అంటే ఇదీ... సర్జికల్ స్ట్రయిక్స్ పై మోహన్ బాబు స్పందన

  • ఇలాగే దూసుకెళ్లాలి
  • ఇన్నాళ్లకు ఫసక్ కు సరైన అర్థం లభించింది
  • ట్వీట్ చేసిన డైలాగ్ కింగ్

పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా భారత్ మెరుపుదాడులు నిర్వహించడం యావత్ భారతాన్ని సంతోషానికి గురిచేసింది. పాకిస్థాన్ బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కంట్రోల్ సెంటర్ పై దాడిచేసిన భారత యుద్ధ విమానాలు తక్కువ సమయంలో అపార నష్టం కలుగజేశాయి. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతులైనట్టు సమాచారం. ఇక, భారత్ నిర్వహించిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్ పై సెలబ్రిటీల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, రాజమౌళి తదితరులు భారత వాయుసేన తెగువకు సెల్యూట్ చేశారు.

ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సర్జికల్ స్ట్రయిక్స్ పై వ్యాఖ్యానించారు. "ఇన్నాళ్లకు ఫసక్ అంటే సరైన అర్థం లభించింది... ఫసక్ కు నిజమైన అర్థం ఇదే... జైహింద్! పదండి ముందుకు!" అంటూ ట్వీట్ చేశారు. మోహన్ బాబు గతంలో ఓ సినిమాలో పలికిన ఊతపదమే 'ఫసక్'. అయితే ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఫినిష్ అనే అర్థంలో దీన్ని నెటిజన్లు విస్తారంగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మోహన్ బాబు తన డైలాగ్ తోనే సర్జికల్ స్ట్రయిక్స్ పై స్పందించడం ట్విట్టర్ లో చాలామందిని ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News