All Party Meeting: నేటి సాయంత్రం అత్యవసర అఖిలపక్ష సమావేశం... రావాలని రాహుల్, ములాయం, మమతలకు ఆహ్వానం!
- సాయంత్రం 5 గంటలకు సమావేశం
- పలు రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం
- పుల్వామా దాడి తరువాత రెండో అఖిలపక్షం
భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత, దేశంలో నెలకొన్న పరిస్థితులు, పాక్ వైపు నుంచి వచ్చే ముప్పుపై చర్చించేందుకు నేటి సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నిర్ణయించింది. సాయంత్రం 5 గంటలకు సమావేశం ఉంటుందని, దీనికి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ తదితరులకు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతాలోనూ స్పందించారు. కాగా, ఇటీవల పుల్వామా దాడి తరువాత కూడా నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
External Affairs Minister Sushma Swaraj has called an all-party meeting at 5pm today. (file pic) pic.twitter.com/ByYTntwdFy
— ANI (@ANI) February 26, 2019