nani: ఓవర్సీస్ బిజినెస్ పూర్తిచేసుకున్న నాని 'గ్యాంగ్ లీడర్'

  • నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్'
  • ప్రతినాయకుడిగా కార్తికేయ
  • ఆగస్టులో భారీ విడుదల  

నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవలే ఈ సినిమాకి 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. విభిన్నమైన కథాకథనాలతో కొనసాగే ఈ సినిమాలో, నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది.

'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. నాని .. విక్రమ్ కుమార్ కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగా, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను 'సరిగమ సినిమాస్' వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇందుకోసం వాళ్లు 5 కోట్లను చెల్లించినట్టుగా చెప్పుకుంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News