Chandrababu: ముందస్తు పొత్తే బెటర్: మనసులో మాటను బయటపెట్టిన చంద్రబాబు

  • దీని వల్ల బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవచ్చు
  • అన్ని పార్టీలతో మాట్లాడుతున్నా
  • ప్రతిపక్షాల విమర్శలకు  కౌంటర్ ఇవ్వాల్సిందే

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో మిత్ర పక్షాలతో కలిసి ఎలా ముందుకు వెళ్లనున్నామనే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం.. రాజకీయ అంశాలను చర్చించేందుకు మంత్రులతో కలిసి మధ్యాహ్న భోజన సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలతో ముందుస్తు పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లడమే మేలని అభిప్రాయడ్డారు. ఇందుకోసం అన్ని పార్టీలతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. ముందస్తు పొత్తు పెట్టుకోకపోతే.. ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు కనుక వస్తే ఆ పార్టీనే రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉందన్నారు. ముందస్తు పొత్తు పెట్టుకోవడం వల్ల దీనిని అడ్డుకోవచ్చన్నారు.

విపక్షాల వాదనను సమర్థంగా తిప్పికొట్టకపోతే వారి వాదనే ప్రజల్లోకి వెళ్తుందని, కాబట్టి తప్పకుండా కౌంటర్ ఇవ్వాల్సిందేనన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే మంత్రులు ఏమీ పట్టనట్టు ఉండడం సరికాదన్నారు.

జగన్‌కు అనుకూలంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకే మేలు చేసే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు అన్నప్పుడు చంద్రబాబు కల్పించుకుని అలాగని ఏమీ పట్టనట్టు ఉండడం సరికాదని, వాళ్లందరూ కలిసే కుట్రలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.  

  • Loading...

More Telugu News