Komatireddy Venkatreddy: కాంగ్రెస్ నేతలు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు స్టే

  • గత శాసనసభలో అనర్హత వేటు వేసిన స్పీకర్
  • స్పీకర్ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
  • సింగిల్ జడ్జి విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు నేడు స్టే విధించింది. శాసనసభలో నియమాలను ఉల్లంఘించారని వెంకటరెడ్డి, సంపత్‌పై గత శాసనసభలో స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ అనంతరం వారిద్దరిపై అనర్హత ఎత్తివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయట్లేదని.. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందంటూ మళ్లీ హైకోర్టును కోమటిరెడ్డి, సంపత్ ఆశ్రయించారు. ఈ ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి విచారణను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Komatireddy Venkatreddy
Sampath Kumar
High Court
Assembly
  • Loading...

More Telugu News