Hyderabad: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి

  • ఇబ్రహీంపట్నంలో ఘటన
  • విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన యువకుడు
  • విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్లేనన్న కుటుంబ సభ్యులు

మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మన్నెగూడకు చెందిన గనుకుల నరేశ్ (24) శనివారం రాత్రి ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, నరేశ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విద్యుదాఘాతం వల్లే నరేశ్ మృతి చెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ సరఫరాలో నిత్యం హెచ్చతగ్గులు వస్తుంటాయని, నరేశ్ మృతికి అదే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Ibrahimpatnam
Manneguda
mobile charging
Police
  • Loading...

More Telugu News