Pawan Kalyan: జనసేనలోకి 'ఆ ఎంపీ రావాలి, ఈ ఎంపీ రావాలి' అని నేను కోరుకోవడం లేదు: పవన్

  • ప్రభుత్వ సొమ్మును డ్వాక్రా మహిళలకు ఇచ్చి ఓట్లు కొంటున్నారు
  • కొండారెడ్డి స్ఫూర్తితో రాజకీయ ప్రక్షాళన
  • నాది కులాలను ఏకం చేసే రాజకీయం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్మేమీ ఆయన జేబులోనిదో, టీడీపీ పార్టీ నేతలదో కాదని అన్నారు. ప్రభుత్వ సొమ్మునే ఇస్తూ ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తానైతే అమలు చేయగలనని పూర్తిగా నిర్ధారించుకున్నాకే ఏదైనా హామీ ఇస్తానని స్పష్టం చేశారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొండారెడ్డి స్ఫూర్తితో రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని పవన్ పేర్కొన్నారు. జనసేనలోకి ఆ ఎంపీ రావాలని, ఈ ఎంపీ రావాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలన్నదే తన తాపత్రయమని పేర్కొన్నారు. ప్రజలను కులమతాల వారీగా విడదీసి హామీలు ఇవ్వడం సరికాదన్న పవన్.. తాను కులాలను ఏకం చేసే రాజకీయాలు చేస్తానన్నారు. తనకు కాన్షీరాం ఆదర్శమని పవన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News