Jayalalitha: జయలలిత బయోపిక్ టైటిల్ ప్రకటన

  • ప్రియమణి దర్శకత్వంలో ‘ఐరన్ లేడీ’
  • ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ‘తలైవి’
  • తొమ్మిది నెలలపాటు పరిశోధనలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితాధారంగా ప్రస్తుతం రెండు బయోపిక్‌లను తెరకెక్కిస్తున్నారు. ఓవైపు ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ‘ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంటే.. మరోవైపు ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌కు సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమా కోసం పరిశోధనలు జరిపి మరీ ఆయన రంగంలోకి దిగారు. జయలలిత జయంతి సందర్భంగా నేడు చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించింది. విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Jayalalitha
Thalaivi
Iron Lady
Priyamani
Nityamenon
AL Vijay
  • Loading...

More Telugu News