up: కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన ప్రధాని మోదీ!
- త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసిన ప్రధాని
- ప్రత్యేక పూజలు... గంగా నదికి హారతిచ్చిన మోదీ
- పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, వారికి సన్మానం
ఉత్తరప్రదేశ్ లో అర్ధకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశాక ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా నదికి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఈ కుంభమేళాలో అంకిత భావంతో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, వారికి శాలువాలు కప్పి సన్మానించారు. ‘స్వచ్ఛ భారత్’ కలను ముందుకు తీసుకెళ్లడంలో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, ఇందుకు సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, బీజేపీ నేతలు తదితరులు ఉన్నారు.